![]() |
![]() |
Zee Teluguలో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -336 లో......జయ ఎంగేజ్మెంట్ ఎలాగైనా జరిపించాలని వీరు ప్రయత్నం చేస్తాడు. అబ్బాయి మేనమామ విశ్వ పక్కన కూర్చొని అతన్ని ఇర్రిటేట్ చేస్తాడు.ఆ తర్వాత పెళ్లి కొడుకు మేనమామ ఈ పెళ్లి ఆపాలని గొడవ చేస్తాడు. మా అమ్మాయిని కాదని వేరొక అమ్మయిని ఎలా చేసుకుంటాడని గొడవ చేస్తాడు.
వీరు వచ్చి ప్లీజ్ బాబాయ్ గారు ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగకుండా చుడండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అలా చెయ్యాలంటే నాకు డబ్బు కావాలని అతను అంటాడు. సరే ఇరవై లక్షలు ఇస్తానని వీరు అంటాడు. కోటి రూపాయలు కావాలని అతను డిమాండ్ చేస్తాడు. ఏంట్రా బ్రతిమిలాడుతుంటే రెచ్చిపోతున్నావని వీరు అనగానే ఏంటి మాట తీరు మారిందని వీరుని రెచ్చగొడుతాడు అతను. దాంతో వీరు అతన్ని కొడతాడు. అదంతా రంగా చూసి ఏంటి వీరు పెళ్లికొడుకు మేనమామని కొడుతున్నావని అందరిని పిలుస్తాడు.
ఏమైందని విశ్వ అడుగుతాడు. అబ్బాయి వాళ్ళ మేనమామని వీరు కొట్టాడని రంగా చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో పెళ్లికొడుకు వాళ్ళ గురించి విశ్వకి తెలుస్తుంది. వాళ్ళ గురించి బయటపెట్టడానికే అతన్ని రప్పించానని రుద్ర అంటాడు. ఈ ఎంగేజ్మెంట్ జరగదని విశ్వ అంటాడు. నిన్ను వాళ్ళకి దూరం చేసానన్న కోపంతో నేను అలా బాధపడాలని చేశారని విశ్వ అంటాడు. సుధా నీకు ఇక పుట్టిల్లు లేదు.. ఉన్న కాస్త బంధం కూడా పోయిందని విశ్వ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |